Congress party : తెలంగాణ ప్రజలకు గుడ్న్యూస్.. ఆరోగ్య శ్రీపై కీలక నిర్ణయం

Byline :  Bharath
Update: 2023-12-09 08:53 GMT

అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలు ప్రక్రియను మొదలుపెట్టింది. ఆరింటిలో.. మొదటగా రెండింటిని ఇవాళ అమలు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అసెంబ్లీ ఆవరణలోని ఒకటో గేటు వద్ద.. ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.10లక్షలకు పెంపు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆరోగ్రశ్రీ లోగో, పోస్టర్ లను.. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణానికి జీరో చార్జీ టికెట్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. దీంతో పాటు ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ కు రూ.2కోట్లు ప్రోత్సాహక చెక్ ను ప్రభుత్వం తరుపున అందించారు.




 


ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్.. ఈరోజు తెలంగాణ ప్రజలకు పండగరోజని చెప్పారు. 2009, డిసెంబర్ 9న తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని.. తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం కనిపిస్తుందని చెప్పుకొచ్చారు. తనది తెలంగాణ అని గర్వంగా చెప్పుకునే అవకాశాన్ని సోనియా గాంధీ ఇచ్చారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజల కోసం సోనియా గాంధీ ఆరు గ్యారంటీలను ఇచ్చారని.. ఇవాళ వాటిని అమలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. మిగిలిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేసి.. తెలంగాణను సంక్షేమ రాజ్యంగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు.






Tags:    

Similar News