కేసీఆర్కు పేదల కష్టాలు పట్టవు - మల్లిఖార్జున ఖర్గే

By :  Kiran
Update: 2023-11-22 14:43 GMT

ఇందిరా గాంధీని తిట్టే స్థాయి సీఎం కేసీఆర్ కు లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండలో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖర్గే కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పేదరిక నిర్మూలన కోసం ఇందిరమ్మ ఏం చేయలేదన్న కేసీఆర్‌ వ్యాఖ్యలను తప్పుబట్టారు. అసలు ఆయనకు పేదల కష్టాలు పట్టవని విమర్శించారు. నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ లేకుంటే తెలంగాణ ఎలా ఉండేదన్న ఖర్గే.. దేశంలో ఆహార ధాన్యాల కొరత తీర్చిందే ఇందిరమ్మ అని అన్నారు.రైతులు, దళితులు, నిరుపేదలకు న్యాయం చేయడమే ఇందిరమ్మ రాజ్యమని ఖర్గే అన్నారు. హరిత, శ్వేత విప్లవం వచ్చినప్పుడు కేసీఆర్ ఎక్కుడున్నారన్న ఖర్గే.. మోడీతో అంటకాగడమే ఆయనకు తెలుసని అన్నారు.

అంతకుముందు ఆలంపూర్‌ సభలో మాట్లాడిన ఖర్గే సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ, ఎంఐఎం అధినేత ఓవైసీ ముగ్గురు తోడు దొంగలేనని ఆరోపించారు. నిరుపేదలను ఆదుకోవడంలో బీజేపీ, బీఆర్ఎస్ నిర్లక్షం చేస్తున్నాయని విమర్శించారు. ఫామ్ హౌస్‌లో కూర్చొని పాలిస్తున్న కేసీఆర్.. 2017లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని ఖర్గే మరోసారి స్పష్టం చేశారు.

Tags:    

Similar News