Sarvey Sathyanarayana Vs krishank : అవసరమైతే అల్లుడిపైనా పోటీ చేస్తా.. సర్వే సత్యనారాయణ

Update: 2023-08-25 14:29 GMT

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తను పోటీ చేద్దామనుకున్నానని, అయితే అధిష్టానం మాత్రం అసెంబ్లీ బరిలోకి దిగమని ఆదేశించిందని మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ తెలిపారు. ఆయన శక్రవారం కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకుని మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోతుందన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ టికెట్ కోరుతున్న ఆయన పార్టీ ఆదేశాలను తుచ తప్పకుండా పాటిస్తానన్నారు.

‘‘కొందరు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పార్టీ నన్ను సస్పెండ్ చేయలేదు. నేను ఏ తప్పూ చేయలేదు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి. ఆమెను విడిచి నేనెక్కడికి వెళ్తాను?’’ అని అన్నారు. తన తన అల్లుడు క్రిశాంక్‌కు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం, ఇవ్వకపోవడం ఆ పార్టీ గొడవ అన్న సర్వే, అవససరమైతే అతనిపైనా పోటీకి వెనకడానన్నారు. ‘‘క్రిశాంక్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినా నేను వెనక్కి తగ్గను, కాంగ్రెస్ అభ్యర్థిగా తలపడతాను. అల్లుడిపైనే కాదు, కొడుకుకు మీదా పోటీ చేస్తాను’’ అని తేల్చి చెప్పారు. 1985- 89 మధ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కంటోన్మెంట్ ప్రజలకు ఎన్నో సేవలు చేశానని, వారి ఆశీర్వాదాలు తనకు ఉన్నాయని చెప్పారు. కేసీఆర్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. క్రిశాంక్‌కు బీఆర్ఎస్ టికెట్ దక్కలేదు. మైనంపల్లి తిరుగుబాటు నేపథ్యంలో ఆ స్థానంలో క్రిశాంక్‌ను నిలబెడతారనే ఊహాగానాలు వస్తున్నాయి. కంటోన్మెంట్ బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే సాయన్న చనిపోయంతో బీఆర్ఎస్ టికెట్ ఆయన కూతురు లాస్య నందితకు దక్కింది.


Tags:    

Similar News