అభ్యర్థుల ఎంపికలో జోరు పెంచిన కాంగ్రెస్.. నేడు స్క్రీనింగ్ కమిటీ మీటింగ్

Byline :  Kiran
Update: 2023-09-04 03:19 GMT

అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దింపే అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ వేగం పెంచింది. ఆదివారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ 199 నియోజకవర్గాల్లో టికెట్ కోసం అభ్యర్థులు చేసుకున్న దరఖాస్తులు పరిశీలించింది. నియోజకవర్గాలవారీగా పేర్లు షార్ట్ లిస్ట్ చేసింది. ఎంపిక చేసిన అభ్యర్థుల వివరాలను సీల్డ్ కవర్ లో ఇవాళ స్క్రీనింగ్ కమిటీకి అందజేయనుంది.

కాంగ్రెస్ సీనియర్ నేత, స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్‌ నేతృత్వంలోని స్క్రీనింగ్‌ కమిటీ ఇవాళ గాంధీభవన్‌లో భేటీ కానుంది. మురళీధరన్, సిద్ధిఖీ, జిగ్నేశ్‌ మేవానీలతో కూడిన కమిటీ ఉదయం 10 గంటల నుంచి పీఈసీ సభ్యులతో ముఖాముఖి మాట్లడనుంది. సాయంత్రం వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఇక మంగళవారం ఉదయం ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో సభ్యులుగా లేని డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలతో కూడా స్క్రీనింగ్‌ కమిటీ సమావేశమై వారి అభిప్రాయాలు తెలుస్తోందిం అనంతరం రిపోర్టు తయారు చేసి బుధవారం ఏఐసీసీ కార్యదర్శులు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ తో కలిసి దానిపై చర్చించనునంది.




 


26 నియోజకవర్గాల్లో మెజారిటీ సభ్యులు ఒక్కటే పేరు సూచించినట్లు సమాచారం. మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించి ఇద్దరు, ముగ్గురు పేర్ల వైపు సభ్యులు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. సోమవారం జరగనున్న భేటీలో 45 నుంచి 50 స్థానాల అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి హైకమాండ్ కు పంపనున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.




Tags:    

Similar News