చేవెళ్ల సీటును కాంగ్రెస్ వంద కోట్లకు రంజిత్ రెడ్డికి అమ్ముకుంది : కార్తీక్ రెడ్డి

Byline :  Vamshi
Update: 2024-03-18 10:51 GMT

చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ యువ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి ఫైర్‌య్యారు. రంజిత్‌రెడ్డి తన స్వార్థం కోసం కన్నతల్లిలాంటి బీఆర్‌ఎస్ పార్టీని వీడి హస్తం పార్టీలో చేరారని ఆయన అన్నారు.చేవెళ్ల ఎంపీ సీటును కాంగ్రెస్ పార్టీ రూ. 100 కోట్ల‌కు అమ్ముకుంద‌ని స్థానిక కాంగ్రెస్ నాయ‌కులు మాట్లాడుకుంటున్న‌ట్లు తెలిసింద‌ని కార్తీక్ రెడ్డి తెలిపారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ప‌టోళ్ల కార్తీక్ రెడ్డి మీడియాతో బీఆర్‌ఎస్‌ నుంచి ఎంపీగా ఎన్నికైన రంజిత్‌రెడ్డి ఐదేండ్ల కిందట ఎవరికీ తెలియదు..ఆయనకు కేసీఆర్ పిలిచి చేవెళ్ల సీటు ఇచ్చారు.. ఆయనను మేము భుజాల మీద మోసి ఎంపీగా గెలిపించామని కార్తీక్ అన్నారు.

ఆయన మా ప్రాంతంవాడు కాకపోయినా నెత్తినమోసినం.. కేసీఆర్ పౌల్ట్రీ అసోసియేషన్‌కు రూపకల్పన చేసి, దానికి రంజిత్‌రెడ్డిని ప్రెసిడెంట్‌ను చేశామని చెప్పారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు,నాయకుని బిడ్డ అరెస్టై ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రంజిత్‌రెడ్డి పార్టీని వీడి నయవంచన చేశాడు‌‌..చేవెళ్ల సీటును కాంగ్రెస్ వంద కోట్లకు రంజిత్ రెడ్డికి అమ్ముకుంది ఈ విషయాన్ని కాంగ్రెస్ కార్యకర్తలే చెబుతున్నారు.డబ్బుతో టికెట్లను, నాయకులను, కార్యకర్తలను కొనుక్కోవచ్చు కానీ ఓటర్లను, ప్రజలను కొనుక్కోలేరని రంజిత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి..కాంగ్రెస్ మమ్మల్ని ఖతం చేయాలని ప్రయత్నించింది.. అందుకే అప్పుడు మేను కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరినం‌.. మేము కాంగ్రెస్‌ను మోసం చేయలేదని పటోళ్లు తెలిపారు.

Tags:    

Similar News