CPI Narayana : అందువల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది..లేకపోతే.. : నారాయణ

Byline :  Krishna
Update: 2023-12-18 08:44 GMT

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. సీపీఐతో పొత్తు వల్ల తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కమ్యూనిస్టులతో పొత్తు లేకపోవడం వల్లే మిగతా 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం దీన్ని గుణపాఠంగా తీసుకుని ముందు సాగాలని సూచించారు. రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒంటెద్దు పోకడల వల్లే ఓడిపోయిందని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ అందరినీ కలుపుకుపోయి విజయం సాధించిందని చెప్పారు. కొత్త ప్రభుత్వంపై ప్రజలకు కొండంత ఆశలు ఉన్నాయని..వాటిని నెరవేర్చాలన్నారు

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళలో 4, తమిళనాడు 2, బెంగాల్ 3, బస్తర్, తెలంగాణ, ఏపీలో ఒక్కో సీట్లో పోటీ చేస్తామని చెప్పారు. ఏపీ సీఎం జగన్ బతికి ఉండగానే సమాధి కట్టుకుంటున్నారని మండిపడ్డారు. ధరణి పేరుతో కేసీఅర్ చేసిన మోసాల కంటే జగన్ ఎక్కువ తప్పులు చేశారని విమర్శించారు. పాస్‌బుక్‌లో జగన్ ఫోటోలు ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ లాగే ఏపిలో కూడా అధికార మార్పిడి ఖాయమన్నారు.

తెలంగాణలో పదవి విరమణ పొందిన అధికారులకు ఏ బాధ్యతలు కట్టబెట్టకూడదని ఈ సందర్భంగా నారాయణ అన్నారు.


Tags:    

Similar News