కేసీఆర్ను జగన్ అందుకే కలిశారు.. నారాయణ సంచలన వ్యాఖ్యలు..

By :  Krishna
Update: 2024-01-04 10:06 GMT

ఏపీ సీఎం జగన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలవడంపై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో సాయం కోసమే జగన్ కేసీఆర్ను కలిశారన్నారు. ఎన్నికల వేళ కేసీఆర్ను గెలిపించాలని జగన్ ఎంత ప్రయత్నించినా అది సఫలం కాలేదని చెప్పారు. పోలింగ్ రోజు నాగార్జునసాగర్‌లో లేని గొడవ సృష్టించి విఫలమయ్యారని విమర్శించారు. ఇప్పుడు తనకు సాయం చేయాలని కేసీఆర్ను అడగడానికే వచ్చారని ఆరోపించారు. చెల్లిని, బాబాయ్ను దూరం చేసుకున్న జగన్.. అధికారానికి కూడా దూరం అవుతారని అన్నారు.

జగన్‌లో ఓటమి భయం స్పష్టంగా కన్పిస్తుందని నారాయణ అన్నారు. పొత్తు పేరుతో చంద్రబాబుకు బీజేపీ నష్టం చేయాలని చూస్తోందని ఆరోపించారు. ప్రధానిగా ఉన్న మోదీ మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనకూడదని.. కానీ ఆయన అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవంలో పాల్గొంటున్నారని మండిపడ్డారు. రాబోయే లోక్ సభ ఎన్నికల కోసమే రామ మందిర నిర్మాణమని అన్నారు. ఇక కాంగ్రెస్ తప్పిదాల వల్లే మిగితా మూడు రాష్ట్రాల్లో ఆ పార్టీ ఓడిపోయిందన్నారు. కాగా సీఎం జగన్.. తుంటి ఎముక సర్జరీ చేయించుకున్న కేసీఆర్ను ఇవాళ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.


Tags:    

Similar News