పొత్తా.. చిత్తా.. కాంగ్రెస్కు సీపీఎం డెడ్ లైన్

Byline :  Bharath
Update: 2023-11-02 01:49 GMT

పొత్తులపై గురువారం (నవంబర్ 2) మధ్యాహ్నం 3 గంటల లోపు ఏ విషయం తేల్చాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డెడ్ లైన్ విధించారు. బుధవారం జరిగిన సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశంలో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సీపీఐతో చర్చించి కుదిరితే కలిసి పోటీ చేస్తామని చెప్పుకొచ్చారు. లేదంటే ఎన్నికల్లో ఒంటరిగానే దిగనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని, పొత్తులు కుదరకపోతే తమ అభ్యర్థుల్ని ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. సీట్ల సర్ధుబాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ తీరుపై సీపీఎం నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఈ విషయంపై ఒత్తిళ్లు వస్తున్నాయని తెలిచారు.

పొత్తు విషయంలో కాంగ్రెస్ ఆదర్శమైన మాటలు చెప్తున్నా.. ఆచరణ అందుకు విరుద్దంగా ఉందని తీవ్ర విమర్శలు గుప్పించారు. మిర్యాలగూడతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఒక సీటును తమకు కేటాయించాలని సీపీఎం మొదటి నుంచి పట్టుబడుతుంది. పాలేరు అసెంబ్లీ టికెట్ కావలని డిమాండ్ చేయగా.. కాంగ్రెస్ దానికి నో చెప్పింది. అంతేకాకుండా మిర్యాలగూడ, వైరా అసెంబ్లీ టికెట్ల డిమాండ్ పై స్పష్టత రావాల్సి ఉంది. 

Tags:    

Similar News