ఈటల ఇంటికి సీఆర్‌పీఎఫ్ జవాన్లు

Update: 2023-07-13 13:25 GMT

ప్రాణహాని ఉందన్న ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు వై ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గురువారం సీఆర్‌పీఎఫ్ జవాన్లు ఈటల రాజేందర్ స్వగృహానికి చేరుకున్నారు. శామీర్ పేటలోని ఈటల నివాసానికి వచ్చి విధుల్లో చేరారు. ఇప్పటి వరకు ఈటలకు 2 ప్లస్‌ 2 భద్రత ఉండేది. వై ప్లస్‌ భద్రత నేపథ్యంలో ఇకపై మొత్తం 11 మంది భద్రతా సిబ్బంది ఈటలకు సెక్యూరిటీగా ఉంటారు. ప్రతి షిఫ్ట్‌లో ఇద్దరు చొప్పున పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్స్‌లు రోజుకు మూడు షిఫ్టుల్లో విధుల్లో ఉంటారు. మరో ఐదుగురు గార్డులు ఈటల ఇల్లు, కార్యాలయం వద్ద భద్రతా విధుల్లో ఉంటారు.

ఇటీవల తన భర్త ఈటలకు ప్రాణహాని ఉందంటూ ఈటల జమున ఆరోపించారు. ఈటల హత్యకు BRS ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి రూ.20 కోట్లు సుపారీ ఇచ్చారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈటల రాజేందర్ సైతం తనకు ప్రాణహాని ఉందని చెప్పడంతో స్వయంగా ఈటల రాజేందర్‌కు భదత్ర పెంచుతామని కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు పోలీసు అధికారులు సైతం ఈటల ఇంటిని పరిశీలించారు. అయితే రాష్ట్ర భద్రతను నిరాకరించిన ఈటల కేంద్ర భద్రతను కోరారు. ఈటలతో పాటు ఎంపీ అర్వింద్‌కు కూడా కేంద్ర హోంశాఖ వై కేటగిరి భద్రతను కల్పించింది.

Tags:    

Similar News