Rapido Bike:ఇదెక్కడి కర్మ రా నాయనా.. పెట్రోల్ అయిపోయినా బైక్ దిగని కస్టమర్‌

Byline :  Veerendra Prasad
Update: 2024-02-12 03:51 GMT

హైదరాబాద్ మహానగరంలో చాలామంది కాలేజీ విద్యార్థులు, ఐటీ మరియు ఇతర కంపెనీల ఉద్యోగులు రాపిడో సేవలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇతర రవాణా సౌకర్యాలతో పోలిస్తే.. సరైన సమయానికి గమ్యస్థానానికి చేర్చేందుకు రాపిడో బైకులే బెటర్ అని భావిస్తున్నారు. అదొక్కటే కాదు ఆటో ఛార్జీల కన్నా రాపిడో బైక్ (Rapido) బుక్ చేసుకుంటే తక్కువ ధర పడుతుందని, ఎంత పెద్ద ట్రాఫిక్ ఉన్నా ఈజీగా వెళ్లిపోవచ్చని.. ఫోన్‌లో ఇలా బుక్ చేసుకుంటే అలా హ్యాపీగా వెళ్లిపోవొచ్చని.. ఇలా నానారకాలుగా ఆలోచిస్తున్నారు

అయితే తాజాగా ఓ రాపిడో బైక్ డ్రైవర్ కు వింత సంఘటన ఎదురైంది. కస్టమర్ చేసిన పనికి... అతనికి చుక్కలు కనిపించాయి. బైక్ బుక్ చేసుకున్న కస్టమర్‌ను గమ్యస్థానంలో దింపాల్సి ఉండగా.. మార్గమధ్యలో సడెన్‌గా బైక్‌లో పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ లేక బైక్ ఆగిపోయిందన్న బైక్ రైడర్ మాటలకు.. అందుకు నేను బాధ్యుడిని కాదన్నట్లు సదరు కస్టమర్.. బైక్ దిగకుండా అలాగే కూర్చున్నాడు. దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ ఉంది, అక్కడి వరకూ కాస్త నడుచుకుంటూ రావాలని కోరగా.. నిర్ధాక్షిణ్యంగా నో అని చెప్పాడు. ఏం చేయాలో పాలుపోక పాపం ఆ రైడర్.. ట్రాఫిక్ లోనే కస్టమర్ ను బైక్‌పైనే కూర్చోబెట్టి అలాగే తోసుకుంటూ వెళ్లాడు. హైదరాబాద్‌‌లోని కూకట్ పల్లిలో (Kukatpally) ఈ సంఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. ఈ వీడియోను చూసిన జనాలు నవ్వుకోవడమే కాకుండా.. ఆ కస్టమర్‌ ను బండ బూతులు తిడుతున్నారు.




Tags:    

Similar News