"వినాయక విగ్రహాల నిమజ్జనానికి భాగ్యనగరం సిద్ధమవుతోంది." (bhagyanagar utsav committee) దీనికి సంబంధించిన ఏర్పాట్లు, తీసుకోవల్సిన చర్యల గురించి బుధవారం (సెప్టెంబర్ 27) హైదరాబాద్ పోలీస్, భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సమావేశం అయ్యాయి. నాంపల్లిలోని ఆఫీస్ లో జరిగిన ఈ మీటింగ్ లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పాల్గొన్నారు. ఉత్సవాల కార్యాచరణపై పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గణేష్ వేడుకల మొత్తానికి రూ.500 కోట్లు వరకు ఖర్చు చేస్తుందని అన్నారు. భక్తులకు కావాల్సిన భద్రత కోసం.. అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. (Ganesh Immersion) ఈ నిమజ్జనానికి ఎలాంటి ఆటంకం కలుగకుండా చూసుకోవాలని కోరారు.
ఊరేగింపును డీజే పాటలతో కాకుండా భక్తి పాటలతో యాత్ర చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఊరేగింపుల్లో, రథంపై మద్యం బాటిళ్లు ఉంటున్నాయని, టస్కర్ వెహికల్ లో నలభై, యాభై మంది యువకులు డాన్స్ లు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంలాంటి చర్యలకు పాల్పడకుండా విగ్రహాల ఊరేగింపు పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నం 12 గంటల వరకు సౌత్ జోన్ దాటి విగ్రహాల ఊరేగింపు సాగాలని, నాన్ వెజ్ స్టాల్స్, లిక్కర్ అమ్మకాలు ఉండకుండా చర్యలు తీసుకుంటామన చెప్పుకొచ్చారు. గణేష్ ఊరేగింపులో పేపర్ గన్స్, పేపర్ హార్న్స్ వాడొద్దు సూచించారు. తమ టీమ్స్ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఉంటాయని, ఎవరైనా తప్పుడు చర్యలకు పాల్పడితే తగిన చర్యలు తీసుకుంటామని సూచించారు.