వాహనదారులకు హెచ్చరిక.. ఆ వెబ్‌సైట్‌లో చలాన్లు కడుతున్నారా..?
పెండింగ్ చలాన్లకు క్లియర్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. భారీగా చలాన్లు ఉన్నవారు దొరికిందే చాన్స్ అని..కట్టేస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా ఈసారి పోలీస్ వెబ్ సైట్ నే టార్గెట్ చేశారు. ఫేక్ వెబ్ సైట్ క్రియేట్ చేసి వాహనదారులను మోసాలకు పాల్పడుతున్నారు. చలాన్ల చెల్లింపుకు తెలంగాణ పోలీస్ అఫీషియల్ అకౌంట్ www.echallan.tspolice.gov.in/publicview ను వినియోగించాలి. అయితే ప్రస్తుతం నడుస్తున్న ఆఫర్ ను దృష్టిలో పెట్టుకుని సైబర్ నేరగాళ్లు.. www.echallantspolice.in పేరుతో ఫేక్ వెబ్‌సైట్ సృష్టించారు. ఈ సైట్‌లో పేమెంట్ చేయొద్దని, అధికారిక పోలీస్ వెబ్‌సైట్‌లో మాత్రమే చలాన్లు కట్టాలని పోలీసు సూచిస్తున్నారు.
లేదంటే.. మీసేవా సెంటర్లు, పేటీఎం యాప్ ద్వారా పెండింగ్ చలాన్లు కట్టాలని చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆఫర్ కు విశేష స్పందన వస్తుంది. జవనరి 10 వరకు ఈ ఆఫర్ కొనసాగుతుంది. దీన్ని ఆసరాగా తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులను అప్రమత్తం చేసిన పోలీసులు.. చూసుకుని పేమెంట్ చేయాలని, నకిలీ సైట్ లో చేయొద్దని అప్రమత్తం చేశారు.