సురక్షా దినోత్సవ్ వేడుకలు.. ఆ రూట్లలో ట్రాఫిక్ బంద్..

Update: 2023-06-03 12:58 GMT

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలు జరుపుతోంది ఇందులో భాగంగా జూన్ 4న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద డ్రోన్ షో నిర్వహిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ అడ్వయిజరీ జారీ చేశారు. జూన్ 4 సాయంత్రం నుంచి జూన్ 5 ఉదయం వరకు ట్రాఫిక్ మళ్లించనున్నాట్లు చెప్పారు. జూన్ 4వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి జూన్ 5 ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. వాహనదారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

ట్రాఫిక్ మళ్లించే ప్రాంతాలు


AIG హాస్పిటల్ నుంచి కేబుల్ వంతెన మీదుగా జూబ్లీహిల్స్ వైపు వచ్చే వాహనాలను ఐకియా రోటరీ నుంచి సైబర్ టవర్స్, సీఓడీ జంక్షన్ మీదుగా జూబ్లీహిల్స్ వైపు మళ్లిస్తారు.

బయో డైవర్సిటీ, టీ-హబ్ నుంచి కేబుల్ బ్రిడ్జ్ మీదుగా జూబ్లీహిల్స్ వైపు వచ్చే వెహికిల్స్ను ఐకియా రోటరీ నుంచి సైబర్ టవర్స్, సీఓడీ జంక్షన్, నీరూస్ జంక్షన్ మీదుగా జూబ్లీహిల్స్ వైపు పంపుతారు

రోడ్ నంబర్ 45 నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలి వైపు వచ్చే ట్రాఫిక్‌ను రోడ్ నెం.లోని డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వద్ద మళ్లిస్తారు.

ఐకియా ఫ్లై ఓవర్ పూర్తిగా మూసివేస్తారు.

21 రోజుల పాటు సాగే దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న మొట్టమొదటి డ్రోన్ షో జూన్ 4 రాత్రి 7.30గంటలకు ప్రారంభంకానుంది. సైబరాబాద్ పోలీసులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

మరోవైపు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీసులు జూన్ 4న సురక్షా దినోత్సవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ కారణంగా నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్,అంబేద్కర్ సర్కిల్ తో పాటు ఎంజే మార్కెట్, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ క్రమంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. మరింత సమాచారం కోసం 9010203626 నెంబరును సంప్రదించాలని సూచించారు.


Tags:    

Similar News