తెలంగాణలో పోలీసుల సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. ఇటీవలె పంజాగుట్ట సీఐ దుర్గారావు సహా మియాపూర్ ఎస్సై గిరీష్ కుమార్పై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఈ క్రమంలో ఇవాళ మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లు సస్పెండ్ అయ్యారు. కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్ వెంకట్, ఆర్జీఐ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులను సీపీ అవినాష్ మహంతి సస్పెండ్ చేశారు. కేపీహెచ్బీలో దంపతుల వివాదంలో ఓ వ్యక్తిని కొట్టినట్లు వెంకట్పై ఆరోపణలు ఉన్నాయి. సదరు వ్యక్తిని బంధించి చిత్రహింసలు పెట్టినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఓ కేసులో విచారణ చేపట్టనందుకు ఆర్జీఐ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులును సీపీ సస్పెండ్ చేశారు. విధుల్లో అలసత్యం వహించినా.. అక్రమాలకు పాల్పడిన చూస్తు ఊరుకునేది లేదని సీపీ తేల్చి చెప్పారు.