ఐటీ కంపెనీలకు హైదరాబాద్ పోలీసుల సూచన.. ట్రాఫిక్ టెర్రర్ వద్దు..

Update: 2023-07-25 14:16 GMT

కుండపోత వానలతో హైదరాబాద్ రోడ్లలో ట్రాఫిక్ కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోతుండడంతో సైబరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐటీ కంపెనీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో రద్దీ తగ్గించడానికి సూచనలు చేశారు. ఐకియా సెంటర్ నుంచి సైబర్ టవర్స్ వరకు కంపెనీలు మూడు దశలో తమ ఉద్యోగులను డ్యూటీల నుంచి రిలీవ్ చేయాలని కోరారు. కంపెనీల ఉద్యోగులందరూ ఒకేసారి బయటికి వస్తుండడంతో ట్రాఫిక్ భారీగా స్తంభిస్తోందని, విడదల వారీగా బయటికి వస్తే సమస్య తగ్గుతుందని సూచించారు. కంపెనీలను మూడు రకాలను వివగొట్టి టైమ్సింగ్ పెట్టారు. ఫేజ్ 1లోని కంపెనీలు సాయంత్రం 3 గంటలకు, ఫేజ్‌2 లోని కంపెనీలు నాలుగున్నరకు, ఫేజ్‌ 3లోని కంపెనీలు మూడు నుంచి 6 గంటల మధ్య ఉద్యోగులను లాగౌట్ చేయించి వదిలేయాలని కోరారు.

ఫేజ్‌ 1 కంపెనీలు (ఐకియా నుంచి సైబర్ టవర్స్)

రహేజా మైండ్‌స్పేస్‌, టీసీఎస్, హెచ్ఎస్‌బీసీ, డెల్, ఫీనిక్స్, ఫినిక్స్ బిల్డిండ్‌ కంపెనీలు, ఒరాకిల్, గువాల్కోమ్, టెక్ మహీంద్ర, పుర్వా సమిట్, వాటర్ మార్క్ కాంప్లెక్స్ కంపెనీలు.

ఫేజ్‌ 2 కంపెనీలు (ఐకియా చుట్టుపక్క, బయోడైవర్సిటీ, రాయదుర్గం)

నాలెడ్జి సిటీ, నాలెడ్జి పార్కు, టీహబ్, గెలాక్సీ, ఎల్టీఐ, ట్విజ్, కామర్జోమ్, ఆర్ఎంజీ నెక్స్ సిటీ, స్కై వ్యూ, దియర్శ్రీ, ఓరియాన్, అసెండాస్

ఫేజ్ 3 కంపెనీలు (ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్/గచ్చిబౌలి)

డీఎల్ఎఫ్, క్యూసీటీ, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో, శన్షురస్, బ్రాడ్వే, వర్చుసా, బీఎస్రిట్ పార్క్, ఐసీఐసీఐ బిల్డింగ్, వేవ్ రాక్, అమెజాన్, హనీవేల్, హిటాచి, సత్వా, క్యాప్‌ జెమిని, గార్, ఫ్రాంక్లిన్ కంపెనీలు.


Tags:    

Similar News