ప్రగతి భవన్లో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. విజయ దశమి సందర్భంగా సీఎం కేసీఆర్ కుటుంబసమేతంగా పోచమ్మ తల్లిని దర్శించుకున్నారు. ప్రగతిభవన్లోని ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేశారు. సీఎం సతీమణి శోభ, కొడుకు కేటీఆర్, కోడలు శైలిమ, మనవడు హిమాన్షు ఈ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం శమి పూజ నిర్వహించారు.
శమిపూజ అనంతరం సీఎం కేసీఆర్ పాలపిట్ట దర్శనం చేసుకున్నారు. సంప్రదాయం ప్రకారం దసరా రోజు నిర్వహించే వాహనపూజలోనూ ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయుధ పూజ జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ అందరికీ దసరా శుభాకాంక్షలు చెప్పారు.
ప్రగతి భవన్లో కుటుంబంతో కలిసి నల్ల పోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం కేసీఆర్
— Telugu Scribe (@TeluguScribe) October 23, 2023
శమీ పూజ, వాహన పూజ, ఆయుధ పూజ,ఆశీర్వచనం కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్
రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించేలా ఆశీర్వదించాలని, విజయాలు సిద్ధించాలని… pic.twitter.com/W6ZIGdi0ff