Delhi CM Arvind Kejriwal : ట్రాన్స్జెండర్స్కు సీఎం శుభవార్త.. ఇకపై ఫ్రీగా..
Byline : Bharath
Update: 2024-02-05 16:22 GMT
ట్రాన్స్జెండర్స్కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుభవార్త చెప్పారు. ట్రాన్స్జెండర్స్కు దేశ రాజధాని ఢిల్లీలోని సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది ఢిల్లీ ప్రభుత్వం. ఇప్పుడు ట్రాన్స్ జెండర్స్ కు కూడా ఆ అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేజ్రీవాల్.. గత ప్రభుత్వాలేవీ ఇప్పటి వరకు ట్రాన్స్ జెండర్స్ కోసం ఏ పని చేయలేదని ఆరోపించారు. అన్ని ప్రభుత్వాలు వారిని విస్మరించాయని తెలిపారు. వారికి ఉచిత ప్రయాణం కల్పించడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే మహిళలకు, ట్రన్స్ జెండర్స్ కు ఉచిత బస్సు ప్రయాణ సర్వీస్.. కర్నాటక, తెలంగాణ, ఢిల్లీల్లో కనసాగుతుంది.