లిక్కర్ స్కాం కేసు.. మాగుంట రాఘవకు బెయిల్

Update: 2023-06-07 08:30 GMT

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొడుకు రాఘవ రెడ్డికి ఊరట లభించింది. ఢిల్లీ హైకోర్టు ఆయనకు తాత్కాలిక బెయిల్ ఇచ్చింది . లిక్కర్ స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాఘవను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఫిబ్రవరి 10న అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రాఘవ తన అమ్మమ్మ అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉందని ఆమెను చూసుకునేందుకు 6 వారాల పాటు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు.

విచారణ సందర్భంగా రాఘవ బెయిల్ పిటిషన్ను ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది. రాఘవ అమ్మమ్మ బాగోగులు చూసుకునేందుకు చాలా మంది ఉన్నారని చెప్పింది. ఐసీయూలో ఉన్న రోగి వద్ద అటెండెంట్లు ఉండేందుకు హాస్పిటళ్లు అనుమతించవని అలాంటప్పుడు ఆయన వెళ్లి చేసేదేమీ ఉండదని వాదించింది. మనీ లాండరింగ్ చట్టంలో సెక్ష్45 ప్రకారం ఇలాంటి కారణాలకు బెయిల్ మంజూరు చేయొద్దని సూచించింది. కేసులో నిందితులందరి బంధువులు బాత్రూంలో జారిపడి గాయపడుతుండటంపై ఈడీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రాఘవ రెడ్డికి షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.

వాస్తవానికి లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడంతో ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో రాఘవరెడ్డి తాత్కాలిక బెయిల్కు మార్గం సుగమమైంది.  

Tags:    

Similar News