కాంగ్రెస్కు ప్రాజెక్టులపై అవగాహన లేదన్న కేసీఆర్కు భట్టి విక్రమార్క కౌంటర్

Byline :  Kiran
Update: 2024-02-06 15:03 GMT

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి ప్రాజెక్టులు, నీళ్ల గురించి అవగాహన లేదంటూ ఆయన చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. అసలు కేసీఆర్ కు నీళ్ల గురించి ఎలాంటి అవగాహన లేదని చురకలంటించారు. ఆయనకు నీళ్ల గురించి ఏం తెలియనందుకే కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని సటైర్ వేశారు.

నీళ్లపై కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అవగాహన ఉందన్న భట్టి.. అందుకే తమ పార్టీ హయాంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిర్మించామని అన్నారు. నీళ్ల పేరుతో నిధులు దోచుకోవటమే కేసీఆర్‌ తెలుసని మండిపడ్డారు. కాంగ్రెస్కు అలాంటివి తెలియదని అన్నారు. నల్గొండ సభకు ముందే కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని భట్టి డిమాండ్‌ చేశారు.

కేసీఆర్ వ్యాఖ్యలపై మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం స్పందించారు. నీళ్ల గురించి తెలియకనే ఆయన కాళేశ్వరం ప్రాజెక్టును అలా కట్టాడని విమర్శించారు. నిధులు దోచుకోవడం గురించి కేసీఆర్ కు తెలిసినంతగా ఎవరికీ తెలియదని అన్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ గురించి కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

Tags:    

Similar News