ఆరు గ్యారెంటీలు అమలుకావొద్దని కోరుకుంటున్నారు : Bhatti Vikramarka

Byline :  Krishna
Update: 2024-01-06 10:43 GMT

సంపద సృష్టించి పేద ప్రజలకు పంచుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దరఖాస్తుల స్వీకరణ విధానాన్ని పరిశీలించారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని హామీ ఇచ్చాం.. తెచ్చి చూపిస్తామని భట్టి చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేశామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం సహా రాజీవ్‌ ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచామన్నారు.

ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని భట్టి తెలిపారు. బడ్జెట్‌ అంచనాల కోసమే ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ హామీల్లాగే ఆరు గ్యారెంటీలు కూడా అమలు కావొద్దని కొందరు కోరుకుంటున్నారని ఆరోపించారు. కానీ వారు అనుకున్నది సాగదని.. ఎన్ని కష్టాలైన ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ సర్కార్ ధనిక రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చిందని మండిపడ్డారు. కనీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చిందన్నారు.

Tags:    

Similar News