Medaram Jatara : మేడారం జారతకు హెలికాప్టర్‌లో వెళ్లొచ్చు.. రూట్లు ఇవే

Byline :  Bharath
Update: 2024-02-16 05:17 GMT

మేడారం జాతరకు మరో వారం రోజులు మాత్రమే ఉంది. దీంతో సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు ఇప్పటికే భారీ సంఖ్యలో జనం మేడారం బాటపట్టారు. లక్షల మంది భక్తుల రాకతో మరో కుభమేళాను తలపిస్తుంది మేడారం. కాగా మహాజాతరకు చేరేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసింది. మేడారంలో సౌకర్యాలను కల్పించింది. మేడారానికి కాలినడకన, ఎడ్ల బండ్లల్లో, బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో వెళ్తుంటారు. అయితే హెలికాప్టర్ లో కూడా వెళ్లొచ్చని మీకు తెలుసా? గత మూడు జాతరల నుంచి భక్తులు హెలికాప్టర్లలోనూ వస్తున్నారు.




 


ఎప్పటిలాగే ఈసారి కూడా అమ్మలదర్శనానికి ఆకాశ మార్గాన వచ్చే అవకాశాన్ని రాష్ట్ర పర్యటకశాఖ ఏర్పాట్లు చేసింది. హనుమకొండ నుంచి హెలికాప్టర్లో మేడారం వెళ్లొచ్చు. ఇందులో ప్రయాణించే వారికి ప్రత్యేక దర్శనం కూడా ఉంటుంది. మొక్కులు చెల్లించిన తర్వాత తిరుగుప్రయాణం ఏర్పాటుచేస్తారు. దీంతోపాటు భక్తులకోసం స్పెషల్ గా జాయ్ రైడ్ కూడా ఉంటుంది. జాతర పరిసరాలను విహంగ వీక్షణంతో ఆస్వాదించొచ్చు. ఫిబ్రవరి 21 నుంచి 25వ తేదీ వరకు ఈ సేవలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ధరలు త్వరలో నిర్ణయిస్తారు.




Tags:    

Similar News