తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. డీజీపీ అంజనీ కుమార్ తన ఓటును వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.." ప్రజలు ఓటు అనే ఆయుధంతో మంచి నాయకత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉంది. నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాను. నేనే నా భార్య ఇద్దరం మా ఓటు వేశాము. ప్రతి ఒక్కరు తప్పకుండా ఓటు వేయండి. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తగిన ఏర్పాట్లు చేశాం. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశాం. పారామిలటరీ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశాం"అని అంజనీ కుమార్ కోరారు.