కేసీఆర్‌కు రేవంత్ థ్యాంక్స్ చెప్పాలి.. ఆర్జీవీ

Byline :  Lenin
Update: 2023-12-09 14:07 GMT

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం సోషల్ మీడియాకు మరింత మేత అందించింది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మీడియా హ్యాండిళ్లు తగ్గేదేలే అన్నట్లు ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తున్నాయి. మార్పు మొదలైందని కాంగ్రెస్, ఆరు గ్యారంటీలను అమలు చేయకపోతే రోడ్డెక్కుతామని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. ఈ సందట్లోకి సీఎం నివాసం ముందున్న కంచెలు, సచివాలయం కూడా వచ్చేశాయి. రేవంత్ సీఎం అధికార భవనం ముందున్న కంచెలను బద్దలు కొట్టించారు. మరోపక్క మాజీ సీఎం కేసీఆర్ హయాంలో నిర్మించిన సెక్రటేరియట్‌లోనూ సంబరాలు జరిగాయి. ఆంక్షల నుంచి విముక్తి కలిగిందని సచివాలయానికి వెళ్లే ప్రజలు, జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయం ముందు కొందరు సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.. ‘‘ఇది రేవంత్ రెడ్డి కోసం కేసీఆర్ కష్టపడి కట్టించిన సచివాలయం.. ఎవరి కోసం? రేవంత్ కోసం.. థ్యాంక్యూ కేసీఆర్’’ అని సరదా కామెంట్లు పెడుతున్నారు.

ఇలాంటి విషయాల్లో అందరికన్నా ముందుండే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా దీనిపై స్పందించారు. ఆధునిక హంగులతో సచివాలయాన్ని నిర్మించిన ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి కేసీఆర్‌కు కృతజ్ఞత చెప్పాలని ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పట్నుంచి ఆర్జీవీ రేవంత్‌పై ప్రశసంలు కురిపిస్తున్నారు. రేవంత అందరికన్నా మంచి ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారు. రేవంత్‌కు ఎంతో జ్ఞానం ఉందని, ఆయన క్తిసామర్థ్యాలు, ఆలోచనల్లోని పదును తనకు బాగా తెలుసని ట్వీట్ చేశాడు. అయితే వర్మ ఇదివరకు కేసీఆర్‌పైనా ఇలాంగే ప్రశంసలు కురిపించడంతో ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకమని నెటిజన్లు అంటున్నారు.

Tags:    

Similar News