ముగిసిన మేడారం హుండీల లెక్కింపు..ఈ ఏడాది ఆదాయం ఎంతో తెలుసా!
By : Vinitha
Update: 2024-03-06 03:47 GMT
మేడారం మహాజాతర హుండీ ఆదాయం రూ.12,71,79,280 వచ్చింది. మొత్తం 540 హుండీల లెక్కింపు నిన్నటితో ముగిసింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి రూ.26,29,553 ఆదాయం ఎక్కువగా వచ్చింది. ఈ ఏడు మేడారం జాతర అంగరంగ వైభంగా జరిగింది. మునపటితో పోలిస్తే భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవార్లను దర్శించుకొని పునీతులైయ్యారు. వనదేవతలకు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల నుంచి కానుకగా వచ్చిన 800 గ్రాముల బంగారం, 55 కిలోల 150 గ్రాముల వెండిని బ్యాంకులో భద్రపరిచినట్లు అధికారులు తెలిపారు. అయితే హుండీలోని నాణేలను ఇంకా లెక్కించాల్సి ఉంది.