ఏడేళ్ల తర్వాత NIMSకు కొత్త డైరెక్టర్.. కారణం అదేనా

Update: 2023-06-07 14:49 GMT

తెలంగాణలో ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థ నిమ్స్ (నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)కు కొత్త డైరెక్టర్‌ గా డా. బీరప్ప నగరి నియమితులయ్యారు. ఇప్పటివరకున్న డైరెక్టర్ డా. మనోహర్ అనారోగ్య కారణాల వల్ల పదవినుంచి తప్పుకున్నారు. డైరెక్టర్ పోటీలో చాలామంది ప్రముఖ వైద్యులు ఉన్నప్పటికీ.. ప్రభుత్వం డా. బీరప్ప వైపే మొగ్గు చూపింది. ప్రస్తుతం ఇన్ ఛార్జ్ డైరెక్టర్ గా కొనసాగుతున్న బీరప్పకు.. పూర్తిస్థాయి డైరెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏడేళ్లుగా ఒకే డైరెక్టర్:

డా. మనోహర్.. ఏడేళ్లుగా నిమ్స్ డైరెక్టర్ పదవిలో ఉన్నారు. 2015లో డైరెక్టర్ బాధ్యతలు తీసుకున్న మనోహర్.. తాజాగా కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయనకు గుండెపోటు రాగా.. నిమ్స్ లో కాకుండా అపోలో హాస్పిటల్ లో చికిత్స తీసుకున్నాడు. దీనిపై సర్వత్రా విమర్శిస్తున్నారు. ఓ ప్రఖ్యాత సంస్థకు అధిపతిగా ఉండి.. కార్పొరేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకోవడం వల్ల నిమ్స్ ప్రతిష్టను దెబ్బతీశారని విమర్శలు వచ్చాయి.

అంతేకాకుండా కొంతకాలంగా నిమ్స్ హాస్పిటల్ సేవల విషయంలో విమర్శలు వస్తున్నాయి. సిబ్బంది.. తక్కువ స్థాయి రోగుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని, ఆరోగ్యశ్రీ ఉన్న రోగులను సరిగ్గా పట్టించుకోవట్లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వివాదాల వల్ల డా. మనోహర్ డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News