Medipally Sathyam : మొదటి నెల జీతం.. విద్యార్థుల అల్పాహారానికి విరాళం

Update: 2024-02-06 08:01 GMT

సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైన ప్రభుత్వం నిధులను ప్రజా సంక్షేమం కోసం వినియోగిస్తారు. ఏ నాయకుడు కూడా తన సొంత పైసలని ప్రజల కోసం వినియోగించారు. కానీ ప్రతి మనిషి తన మూలాలను తను బాల్యంలో పడ్డ కష్టలను మార్చిపోకూడదు అంటారు. ఆ మాటలని నిజం చేశారు ఓ ఎమ్మెల్యే. కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తన మొదటి నెల శాలరీ జీతం రూ/ 1 ,50 ,000 ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థుల అల్పాహారం కోసం విరాళంగా ఇచ్చారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన తాను ప్రభుత్వ హాస్టల్ ల్లో చదువుకుని.. పిహెచ్ డి పూర్తి చేసానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. ఇక తాను ఎమ్మెల్యేగా అందుకున్న మొదటి జీతాన్ని ప్రభుత్వ పాఠశాల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థుల అల్పాహారం కోసం ఇవ్వడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.




 


తను పడ్డ బాధలు, కష్టలను విద్యార్థులు పడ్డవద్దని బాగా చదువుకోని ఉన్నత స్ధాయికి ఎదగాలని ఆయన అన్నారు. ఇటీవలే గంగాధర ప్రభుత్వ కళాశాల విద్యార్థుల అల్పాహారం కోసం మేడిపల్లి సత్యం రూ 30 వేలు అందచేశారు. భవిష్యత్తులో నిరుపేద విద్యార్థుల చదువు కోసం అండగా నిలబతాను అని సత్యం విద్యార్ధులకు భరోసా కల్పించారు.విద్యార్హత లేకుండా కష్టపడకుండా డబ్బులు సంపాదించుకోవడానికి ఉన్న మార్గాల్లో రాజకీయం మొదటి స్థానంలో ఉందని.. అందుకే ఎలాంటి అర్హత లేని వాళ్ళు కూడా రాజకీయ నేతలుగా చలామణి అవుతున్నారని ప్రజల అభిప్రాయం. అయితే ఆ అభిప్రాయం తప్పని.. ప్రజా సేవ చెయ్యడానికి రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారని నిరూపించారు




Tags:    

Similar News