DSC 2008 Candidates : సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి డీఎస్సీ-2008 అభ్యర్థులు
Byline : Krishna
Update: 2024-02-19 06:14 GMT
సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి డీఎస్సీ 2008 అభ్యర్థులు వెళ్లారు. తమకు అన్యాయం జరిగిందని.. ఇప్పటికైన ఉద్యోగాలు ఇవ్వాలని వినతిపత్రం ఇచ్చేందుకు జూబ్లీహిల్స్లోని సీఎం నివాసానికి వచ్చారు. కామన్ మెరిట్‌లో ఎంపికై నష్టపోయిన బీఈడీ అభ్యర్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో పోస్టులను భర్తీ చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా.. బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని వాపోయారు. గత పదేళ్లుగా తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. న్యాయస్థానం తీర్పును రేవంత్ సర్కార్ అమలు చేయాలని కోరారు. కాగా డీఎస్సీ 2008 అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టింగులపై పున:పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఇటీవలే హైకోర్టు ఆదేశించింది. 4 వారాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది.