MMTS ఫేస్ - 2 పనులు కారణంగా పలు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు

Update: 2024-02-04 09:43 GMT

సికింద్రాబాద్ డివిజన్‌లో పరిధిలో ఎంఎంటీఎస్ (MMTS)ఫేస్ - 2 పనులు కారణంగా పలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు తెలిపారు. మౌలాలి-సనత్‌నగర్ మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనులు కారణంగా కొనసాగుతున్నాయని తెలిపారు. 23 లోకల్ రైళ్లు పాటు మొత్తం 51 రైళ్లను రద్దు చేసినట్లు చెప్పారు. ఈ రైళ్లను టైం టేబుల్ ప్రకారం రద్దు చేసినట్లు వివరించారు. వీటిలో ఈ నెల 9 వరకు మూడు ఎంఎంటీఎస్‌లు, 10వ తేదీ వరకు మరో రెండు, 11 వరకు 18 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు వారు తెలిపారు. వీటితో పాటు మౌలాలి (Maulali) - అమ్ముగూడ - సనత్ నగర్ మార్గంలో నడిచే హైదరాబాద్‌ - సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, వికారాబాద్‌ - గుంటూరు, రేపల్లె - సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ (Secunderabad Express)లను షెడ్యూల్ వారీగా ఆపేస్తామని వివరించారు.

అందుబాటులోకి రానున్న చర్లపల్లి టెర్మినల్

లింగంపల్లి-హైదరాబాద్‌, లింగంపల్లి(Lingampally)-ఉందానగర్‌, లింగంపల్లి-ఫలక్‌నుమా వంటి పలు స్టేషన్ల మధ్య కూడా టైమ్‌ టేబుల్‌ ప్రకారం ఎంఎంటీఎస్‌లను రద్దు చేశామన్నారు. హైదరాబాద్ లోని చర్లపల్లిలో నిర్మిస్తున్న రైల్వే టెర్మినల్ ఈ ఏడాది మార్చి చివరినాటికి సిద్ధమవుతుందని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ చెప్పారు. ఎంఎంటీఎస్‌ రెండో దశలో భాగంగా సనత్‌నగర్‌ (Sanatnagar) - మౌలాలి మధ్య రెండో లైను కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. దీంతో సికింద్రాబాద్‌ స్టేషన్‌ను బైపాస్‌ చేస్తూ కొన్ని రైళ్లను నడిపే అవకాశం కలుగుతుందని జీఎం వివరించారు. 

Tags:    

Similar News