మణుగూరులో మళ్లీ భూకంపం

Update: 2023-08-25 03:34 GMT

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో మరోసారి భూ ప్రకంపనలు నమోదయ్యయాయి. శుక్రవారం తెల్లవారుజామున భూమి కంపించడంతో జనం ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. వారం రోజుల వ్యవధిలో భూమి రెండుసార్లు కంపించడం విశేషం.




 


మణుగూరులో శుక్రవారం తెల్లవారుజామున 4.40 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.6గా నమోదైంది. శేషగిరి నగర్‌, బాపనకుంట, శివ లింగాపురం, విఠల్‌ నగర్‌, రాజుపేటలో భూప్రకంపనలు వచ్చాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఏం జరుగుతుందో అర్థంకాక జయం భయాందోళనలకు గురయ్యారు. ఇండ్లలోంచి బయటకు పరుగులు తీశారు.

గత శనివారం సైతం మణుగూరులో భూ ప్రకంపనలు వచ్చాయి. మండలంలోని సుందరయ్యనగర్ ప్రాంతంలో సాయంత్రం వేళలో 5 సెకన్ల పాటు భూమి కంపించింది. ఆ సమయంలో ఇళ్లలోని వస్తువులు కిందపడ్డాయని స్థానికులు చెప్పారు. భయంతో ఇండ్లలోంచి బయటకు వచ్చి చాలా సేపు రోడ్లపైనే ఉన్నారు. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.




Tags:    

Similar News