కేసీఆర్.. గతంలో ఇచ్చిన హామీలన్నీ ఏమైనయ్ - ఈటల రాజేందర్

By :  Kiran
Update: 2023-11-20 10:08 GMT

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్కు వేసినట్లేనని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈటల నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. కేసీఆర్ కు మళ్లీ అధికారమిస్తే ప్రగతి భవన్, ఫాం హౌస్ కే పరిమితమవుతారని విమర్శించారు.

బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సైతం మాట్లాడే అవకాశంలేదని ఈటల మండిపడ్డారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇంకా ఎందుకు నెరవేర్చలేదని అన్నారు. దళిత సీఎం, రేషన్ కార్డులు, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్‌ హామీలు ఏమయ్యాయని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.


Tags:    

Similar News