మరో నాలుగైదు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ ను విడుదల చేసింది. పోలింగ్ కేంద్రాల మార్పులు, ఓటర్ల ఫొటోల మార్పుల కోసం ఈ నెల 20 నుంచి జనవరి 5వ తేదీ వరకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. కాగా 2024 జనవరి 6న ముసాయిదా ఓటర్ల జాబితా, జనవరి 8న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. ఈ క్రమంలో అయితే 2024 జనవరి 1 వరకు 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం వెల్లడించింది. దీనికోసం ఈసీ అధికారిక వెబ్ సైట్ లో అప్లై చేసుకోవాలని ఎన్నికల సంఘం తెలిపింది.