కరీంనగర్‌ కలెక్టర్‌, సీపీలపై ఈసీ బదిలీ వేటు..

By :  Krishna
Update: 2023-10-27 14:40 GMT

ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు అధికారులను బదిలీ చేసిన ఈసీ.. తాజాగా కరీంనగర్‌ కలెక్టర్‌ సహా పోలీసు కమిషనర్‌పై బదిలీ వేటు వేసింది. కలెక్టర్‌ గోపీ, సీపీ సుబ్బరాయుడును బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సాధారణ పరిపాలనాశాఖకు రిపోర్టు చేయాల్సిందిగా వారికి ఆ ఉత్తర్వుల్లో సూచించింది. ఇద్దరిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గతంలో పలువురు సీపీలు సహా పది జిల్లాల్లో ఎస్పీలను ఈసీ బదిలీ చేసింది. హైదరాబాద్ సీపీగా పనిచేసిన సీవీ ఆనంద్ స్థానంలో సందీప్ శాండిల్యాను నియమించింది. అదేవిధంగా వరంగల్ సీపీగా అంబరీ కిషోర్ ఝా, సంగారెడ్డి సీపీగా చెన్నూరి రూపేష్, నిజామాబాద్ సీపీగా కల్మేశ్వర్ తోపాటు 10 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది.


Tags:    

Similar News