ఎన్నికల వేళ బీఆర్ఎస్కు ఈసీ షాకిచ్చింది. రైతు బంధు, రుణమాఫీ, డీఏ విడుదలకు ఈసీ నో చెప్పింది. వీటికి అనుమతి ఇవ్వాలంటూ కేసీఆర్ సర్కార్ ఎన్నికల కమిషన్‌ను సంప్రదించింది. బీఆర్ఎస్ వినతిని పరిశీలించిన ఈసీ.. ఇది నిబంధనలకు విరుద్ధమంటూ అనుమతి నిరాకరించింది. రైతుబంధును ఆపాలంటూ తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఈసీ స్పష్టం చేసింది. అదేవిధంగా పెండింగ్ డీఏలు ఇప్పుడు ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని ఈసీ ప్రశ్నించింది.అయితే రైతు బంధును ఆపాలంటూ కాంగ్రెస్ పార్టీని ఈసీని ఆశ్రయించిందని.. బీఆర్ఎస్ ఆరోపించింది.