ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..7 రోజులు ఈడీ కస్టడీ

Byline :  Vamshi
Update: 2024-03-16 12:03 GMT

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆమెను మార్చి 23 వరుకు ఈడీ కస్టడీకి అప్పగించింది. కాగా ఈ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న కవితకు 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు సంస్థ అంత ముందు కోరింది. వారం కస్టడీ తర్వాత ఈ నెల 23న తిరిగి తమ ముందు హాజరు పర్చాలని న్యాయమూర్తి నాగ్‌పాల్ ఆదేశించారు. ఆమెకు హైబీపీ ఉందని కవిత లాయర్ తెలిపారు.

గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ స్థాయి రక్తపోటు లేదని కోర్టకు వెల్లడించారు.ఆరోగ్య పరిస్థతిని పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలని అప్పీల్ చేశారు. హైదరాబాద్ నుండి కవితను ఢిల్లీకి తరలించిన ఈడీ.. ఇవాళ కోర్టులో హాజరు పర్చింది. ఈ సందర్భంగా కోర్టులో వాదనలు జరిగాయి. కవిత పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగా ఆమెను అక్రమంగా అరెస్ట్ చేశారని కవిత తరుఫు లాయర్లు వాదించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన సౌత్ గ్రూప్‌లో కవిత కీలకంగా వ్యవహరించారని.. ఆమె విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని ఈడీ తరుఫు లాయర్లు వాదించారు.

Tags:    

Similar News