కవిత అరెస్ట్‌పై ఈడీ ప్రకటన.. రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారంలో ప్రమేయం
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్టుపై ఈడీ అధికారిక ప్రకటన చేసింది. మద్యం పాలసీ కుంభకోణం కేసులో కవితను అరెస్టు చేశామని ఈడీ పేర్కొన్నది. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నామని రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారంలో కవిత ప్రమేయం ఉందన్నారు.ఆప్ నేతలు వంద కోట్లు చేర్చారు.
24ం చోట్ల సోదాలు చేశామని రూ.128 కోట్లు ఆస్తులను జప్తు చేశామని తెలిపారు. మనీశ్ సిసోదియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్‌లతో కవితకు సంబంధం ఉంది అని తెలిపింది.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సోమవారం సాయంత్రం ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ములాఖత్‌లో భాగంగా వీరిద్దరు కవితను ఈడీ కేంద్ర కార్యాలయంలో కలవనున్నారు. కవితను ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కలిసేందుకు కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే.