కాంట్రాక్ట్ లెక్చరర్లకు శుభవార్త.. విద్యాశాఖ ఉత్తర్వులు జారీ..

By :  Lenin
Update: 2023-07-29 01:55 GMT

రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ అధ్యాపకులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని 527 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను ఈ విద్యా సంవత్సరం కూడా కొనసాగిస్తూ కళాశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మూడు నెలల క్రితం 270 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేసిన విషయం తెలిసిందే. మిగిలిన వాళ్లను ఆగస్ట్ 31 లోపు విధుల్లోకి తీసుకోవాలని సూచించింది. మరోవైపు డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లను విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో వాళ్లను కూడా నియమించాలని కళాశాల విద్యాశాఖను ప్రభుత్వం ఆదేశించింది.

Tags:    

Similar News