అభ్యర్థుల్లో డిగ్రీ.. ఆపైస్థాయి చదివిన వారే ఎక్కువ

Byline :  Bharath
Update: 2023-11-26 03:29 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 2290మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. 2018 ఎన్నికలతో పోల్చితే ఈ సంఖ్య చాలా ఎక్కువ. ఆ అభ్యర్థుల్లో చదువుకున్నవారు, చదువుకోనివారు, డాక్టర్లు, డ్రాడ్యూయేట్లు ఇలా అందరూ ఉన్నారు. దీనికి సంబంధించిన లిస్ట్ ను ఈసీ విడుదల చేసింది. అందులో డిగ్రీ ఆపైస్థాయి చవుకున్న వారే ఎక్కువగా ఉండటం విశేషం. ఈసీ పంపించిన లిస్ట్ తెలంగాణలో అసెంబ్లీ అభ్యర్థులు విద్యార్హత వివరాలు ఇవే..

చదువుకోనివారి సంఖ్య 89, చదువుకున్న వారి సంఖ్య 26 ఉండగా.. పదో తరగతి పాసైన అభ్యర్థుల సంఖ్య 441 ఉన్నారు. ఇంటర్‌ పాసైన వారు 330మంది. ఐదో తరగతి వరకు చదువుకున్నవారి సంఖ్య 91, ఎనిమిదో తరగతి చదివిన వారు 117 ఉన్నారు. డిగ్రీ ఆపై చదివిన వారి సంఖ్య 1143మంది ఉండగా.. డిప్లమా చదివిన వారు 53, డాక్టరేట్‌ ఉన్న వారి సంఖ్య 32గా ఉంది.

Tags:    

Similar News