Mahalakshmi scheme : మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్.. సీటింగ్‌ విధానంలో మార్పు

Update: 2024-02-15 04:00 GMT

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేయడంతో మహిళలు పండగ చేసుకుంటున్నారు. ఆ స్కీమ్ ద్వారా ఆర్టీసీలో ప్రయాణించే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. కండక్టర్లు టిక్కెట్లు ఇవ్వడం కూడా కష్టంగా మారిపోయింది. దీంతో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సుల్లోని సీట్ల అమరికలో కొన్ని మార్పులు చేసింది. మెట్రో రైళ్ల మాదిరిగానే బస్సుల్లోనూ సీట్లను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టింది.

ముందుగా కొన్ని బస్సుల్లోనే సీట్ల అమరిక చేపట్టనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. మెట్రో రైళ్లల్లో మాదిరిగానే బస్సు మధ్యలో ఉన్న ఆరు సీట్లను తొలగించి బస్సు వాల్స్‌కు సీట్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రయోగాత్మకంగా కొన్ని రూట్లలోనే ఈ సీట్ల అమరికను చేపట్టారు. ఒకప్పుడు ఆర్టీసీలో రోజుకు 11 లక్షల మంది ప్రయాణించేవారు. ఆ సంఖ్య ఇప్పుడు 20 లక్షల వరకూ చేరుకుంది. పైగా ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది.

మరోవైపు కండక్టర్లు కూడా టిక్కెట్లు ఇచ్చేందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. మహిళల్లో ప్రతి ఒక్కరికీ జీరో టిక్కెట్ జారీ చేయాలన్న నిబంధనను కండక్టర్లు అమలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు తక్షణ పరిష్కారంగా ఆర్టీసీ సీట్ల అమరికలో మార్పులు చేస్తోంది. దీంతో ఇకపై ఆర్టీసీ బస్సుల్లో సీట్ల సంఖ్య కూడా భారీగా తగ్గనుంది. ఇక చాలా మంది నిల్చునే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

Tags:    

Similar News