తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి రూ.5 లక్షల బీమా.. మంత్రి కేటీఆర్

Update: 2023-11-26 10:39 GMT

బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యమిస్తామన్నారు మంత్రి కేటీఆర్. జనవరిలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. ఆదివారం చొప్పదండి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షో లో కేటీఆర్ మాట్లాడుతూ.. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు.

కాంగ్రెస్‌ హయాంలో పింఛన్‌ రూ.200 ఇచ్చేవారని, ఇప్పుడు ఆ పార్టీ నేతలే రూ.2 వేలు ఇస్తామంటున్నారని , వారి మాటలు నమ్మవద్దని సూచించారు. 2014లో రూ.400 ఉన్న సిలిండర్‌ ప్రస్తుతం రూ.1200 అయ్యిందని, మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామన్నారు. కాంగ్రెస్​కు ఓటేస్తే.. కష్టపడి నిర్మించుకున్న తెలంగాణ అభివృద్ధిని కోల్పోతామని చెప్పారు. ఓటర్లు ఓటేసే ముందు ఓసారి ఆలోచించాలని సూచించారు. కరెంట్‌ కావాలా? కాంగ్రెస్‌ కావాలా? అని ప్రజలే ఆలోచించుకోవాలన్నారు.

Tags:    

Similar News