Election Code: హైదరాబాద్‌లో భారీగా హవాలా నగదు పట్టివేత..
ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు విస్త్రతంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మంగళవారం నిర్వహించిన సోదాల్లో రూ.5 కోట్ల నగదుకుపైగా పట్టుబడింది. సికింద్రాబాద్‌లో రూ.50 లక్షల నగదు, బంగారం, వెండి ఆభరణాలతోపాటు రూ.12.15 లక్షల విలువైన మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. సంగారెడ్డి జిల్లాలో రూ.9.4 లక్షలు, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రూ.6.50 లక్షలు, నిజామాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద రూ.5.60 లక్షలు, పెద్దపల్లి జిల్లాలో రూ.3 లక్షలు, వనపర్తి జిల్లా కొత్తకోటలో రూ.2.35 లక్షలు, మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.2 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు.
జారాహిల్స్ పీఎస్ పరిధిలో భారీగా హవాలా నగదు పట్టుకున్నారు పోలీసులు. రూ.3.35 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు.. ముగ్గురిని అరెస్ట్ చేశారు. రోడ్ నెంబర్-3 వద్ద వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా ఉన్న కియా కారును తనిఖీ చేయగా మూడు కోట్ల 35 లక్షల నగదు పట్టుబడిందని వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డెవిస్ వెల్లడించారు. ఈ కేసులో హనుమంతరెడ్డి, బచ్చల ప్రభాకర్, మండల శ్రీరాములు రెడ్డి, ఉదయ్ కుమార్‌లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. హనుమంత్ రెడ్డి సూచన మేరకు మిగతా ముగ్గురు హవాలా మనీ సేకరిస్తూ ఉంటారని, సేకరించిన డబ్బును వారి కార్యాలయానికి తీసుకెళ్తుండగా సీజ్ చేశామని చెప్పారు. పట్టుకున్న నగదును కోర్టులకు అప్పగిస్తామని తెలిపారు.