ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్షన్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. అక్కడ పనిచేస్తూ తెలంగాణలో ఓటు హక్కు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఓటు ఉన్న వారికి వేతనంతో కూడిన సెలవు మంజూరు చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో ఓటు హక్కు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు దాన్ని వినియోగించుకునేందుకు సెలవుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లీవ్ అప్లికేషన్కు ఓటర్ ఐడీ కార్డు జత చేయాలని చెప్పారు. ఉద్యోగుల సంఘం నేతలు చేసిన విజ్ఞప్తికి మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు ఇప్పటికే పోలింగ్ బూత్ లకు చేరుకున్నారు. గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభంకానున్న పోలింగ్.. సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో గంట ముందే అంటే 4 గంటలకే పోలింగ్ క్లోజ్ కానుంది. పోలింగ్ ముగిసే సమయానికి బూత్‌ల వద్ద క్యూలో ఉన్న వారందరికీ అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు.