ఎన్నికల ముంగిట కేసీఆర్ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. రైతు బంధు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రైతుబంధుకు అడ్డంకులు తొలగాయి. నిధులు జమ చేసేందుకు ఈ నెల 28 వరకే ఈసీ అనుమతిచ్చింది. దీంతో వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికలకు మరో ఆరు రోజులే ఉన్న సమయంలో ఈసీ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది.