Election Results 2023:ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
By : Kalyan
Update: 2023-12-03 03:13 GMT
రాష్ట్రవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఓటలర్ లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్ 16 చోట్ల, బీఆర్ఎస్ 13 చోట్ల, ఎంఐఎం, బీజేపీ ఒక్కో చోట ముందంజలో ఉన్నాయి. ములుగు, మంథని పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో కాంగ్రెస్ ముందంజలో ఉంది. గజ్వేల్, కామారెడ్డి స్థానాల్లో బీఆర్ఎస్ దూకుడు ప్రదర్శిస్తోంది. కరీంనగర్ లో బండి సంజయ్, హుజూరాబాద్ లో ఈటెల, ఖమ్మం లో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు , మధిర లో కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క , కొడంగల్ లో రేవంత్ రెడ్డి, సిద్ధిపేటలో మంత్రి హరీశ్ రావు, మంచిర్యాల లో కాంగ్రెస్ ముందంజలో ఉన్నాయి.