నెహ్రూ జూపార్క్లో విషాదం.. ఏనుగు దాడిలో వ్యక్తి మృతి

Byline :  Kiran
Update: 2023-10-07 11:59 GMT

హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్‌లో విషాదం చోటు చేసుకుంది. కేర్ టేకర్పై ఓ ఏనుగు దాడి చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయారు. శనివారం మధ్యాహ్న సమయంలో షహబాజ్ (28) అనే కేర్ టేకర్ ఏనుగుల సఫారీలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో ఓ ఏనుగు హఠాత్తుగా అతనిపై దాడి చేసింది.

ఒక్కసారిగా షహబాజ్పైకి దూసుకొచ్చిన ఏనుగు అతన్ని నేలకేసి కొట్టింది. అది చూసి అప్రమత్తమైన తోటి సిబ్బంటి తీవ్రగాయాల పాలైన బాధితుడిని డీఆర్‌డీఓ అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే షహబాజ్ చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.

సాధారణంగా ఏనుగుల సఫారీలో ఐదారుగురు మావటిలు విధుల్లో ఉంటారు. కానీ శనివారం జూపార్క్‌ 60 ఏండ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించిన వేడుకలో పాల్గొనేందుకు సిబ్బంది వెళ్లారు. ఆ సమయంలో షహబాజ్ ఒక్కరే విధుల్లో ఉండటంతో ఈ ఘటన జరిగింది.




Tags:    

Similar News