త్వరలో మెగా డీఎస్సీ.. బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన భట్టి

By :  Bharath
Update: 2024-02-10 10:22 GMT

తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో మెగా డీఎస్సీ వేయబోతున్నట్లు ప్రకటించారు. సుమారు 15000 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలకు నియామక పత్రాలు అందజేయబోతున్నామని అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. ఇప్పటికే నోటిఫికేషన్ ద్వారా విడుదల చేసిన పోస్టులను కాకుండా.. అదనంగా 64 గ్రూప్ 1 పోస్టులు జత చేశామని భట్టి చెప్పారు. పదేళ్ల పాలనలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిందన్నారు.

టీఎస్పీఎస్సీ సరైన దారిలో నిరుద్యోగ యువత ఆకాంక్షలను నెరవేర్చే విధంగా పనిచేస్తుందని, అందుకు దాన్ని అధికారంలోకి వచ్చార ప్రక్షాళన చేశామన్నారు. టీఎస్పీఎస్సీ తన కర్తవ్యాన్ని నిర్వహించడానికి అవసరమైన రూ.40 కోట్ల ఆర్థిక వనరులను, అదనపు సిబ్బందిని ఇప్పటికే ప్రభుత్వం కేటాయించిందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన పనులతో యువతలో ఆత్మస్థైర్యం దెబ్బతిందని, వారు భవిష్యత్తుపై ఆశను కోల్పోయారని భట్టి ఆరోపించారు. అలాంటి యువత భవిష్యత్తుకు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇచ్చిందని చెప్పారు. అందుకే ఎన్నికల్లో రాష్ట్రంలో యువత తమ వెంట నిలిచి, గెలిపించిందన్నారు భట్టి.

Tags:    

Similar News