డైట్ ఛార్జీల పెంపుతో మరింత నాణ్యమైన భోజనం - ఎర్రోళ్ల శ్రీనివాస్

Update: 2023-07-22 17:05 GMT

థంబ్ : 

సంక్షేమ హాస్టళ్లలో డైట్ ఛార్జీల పెంపుపై టీఎస్ఎంఎస్ఐడీసీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు మరింత నాణ్యమైన భోజనం అందుతుందని అన్నారు. తాజా నిర్ణయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత, బడుగు, మైనార్టీ విద్యార్థులపై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నారని అన్నారు. పేద పిల్లలు ఉన్నత విద్యతో తమ భవిష్యత్ కు బంగారు బాటలు వేసుకునే దిశగా ప్రభుత్వం వారి కలల సాకారానికి ప్రోత్సాహం అందిస్తుందని ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు.

పెద్ద సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేయడం, మరోవైపు సంక్షేమ హాస్టళ్లలో మెరుగైన వసతులు కల్పించడంతో తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యా అవకాశాలు ఏర్పడ్డాయని అభిప్రాయపడ్డారు. ఫలితంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేద విద్యార్థులు తమ ప్రతిభను చాటే అవకాశం ఏర్పడిందని చెప్పారు. పేద విద్యార్థుల కడుపు నింపే ఆలోచన చేసిన సీఎం కేసిఆర్ కు తెలంగాణ సమాజం తరఫున ఆయన కృతజ్ఞతలు చెప్పారు.

errolla srinivas thanks cm kcr for hiking mess charges

telangana,cm kcr,errolla srinivas,social welfare hostels,mess charges,sc,st,bc,minorites,gurukulam,quality food,tsmsidc,diet charges

Tags:    

Similar News