బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ కన్ఫార్మ్ అయ్యిందని.. త్వరలోనే కమలం పార్టీకి రాజీనామా చేస్తారని వార్తలు వచ్చాయి. ఇదే క్రమంలో గత కొన్ని రోజులుగా ఈటల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఈ ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో పార్టీ మార్పు ప్రచారంపై ఈటల స్పందించారు. తాను బీజేపీ వీడడం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆ పార్టీ నేతలే దష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా తాను బీజేపీలో ఉండడం ఇష్టం లేని కొందరు నాయకులు కూడా ఇలా చేస్తుండొచ్చని వ్యాఖ్యానించారు. కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ఆ అసత్యాలను నమ్మొద్దని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు.