ఈటల హత్యకు కౌశిక్ రెడ్డి కుట్ర : జమున

Update: 2023-06-27 09:08 GMT

హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటలను చంపేందుకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈటలను హత్య చేసేందుకు రూ. 20 కోట్లు ఖర్చు చేస్తానని కౌశిక్‌రెడ్డి అన్నాడని ఆమె ఆరోపించారు. కేసీఆర్‌ ప్రోత్సాహంతోనే కౌశిక్‌రెడ్డి చెలరేగిపోతున్నాడని విమర్శించారు.

మహిళలపై కౌశిక్ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చెప్పుల దండ వేస్తారని జమున మండిపడ్డారు. గతంలోనూ గవర్నర్ను కించపరిచారని చరిత్ర అతనిది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి వ్యక్తికి బీఆర్ఎస్ టికెట్ ఇస్తామని చెప్పడం.. ప్రజలపై వారికున్న ప్రేమ ఎటువంటిదో అర్ధమవుతోందన్నారు. కౌశిక్ రెడ్డి చేసే పనులకు కేసీఆర్, కేటీఆర్ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. 


Tags:    

Similar News