బీజేపీకి గట్టి షాక్.. ‘ఇంటింటికీ బీజేపీ’కి ఈటెల, కోమటిరెడ్డి దూరం

Update: 2023-06-22 07:22 GMT

బీజేపీ 9 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో నేటి నుండి 'ఇంటింటికీ బీజేపీ' పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. అందులో భాగంగా తెలంగాణలో ఒక్కరోజే 35 లక్షల కుటుంబాలను కలిసేలా కార్యాచరణను రూపొందించింది. పోలింగ్ బూత్ అధ్యక్షుడి మొదలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల వరకు ప్రతి ఒక్కరూ తమ తమ నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజలకు కేంద్రప్రభుత్వం చేస్తున్న పనులను, పథకాలను వివరించనున్నారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చేపట్టదలిచిన ఈ కార్యక్రమానికి తొలి రోజే గట్టి షాక్ తగిలింది.

ఈ కార్యక్రమానికి సీనియర్లు దూరంగా ఉండడం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. బీజేపీ సీనియర్ నేతలు ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ లు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఈ విషయంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఈ నెల 30వ తేదీవరకు సమయం ఉంది. ఎవరికి కుదిరినప్పుడు వారు పాల్గొంటారని అన్నారు. కొందరు నేతలు ఫోన్ చేసి కుదరడం లేదని చెప్పారని.. ఈ రోజు కాకపోతే రేపు జాయిన్ అవుతారని అన్నారు.

‘ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమంలో ప్రతీరోజు రోజుకు 100 కుటుంబాలను దర్శించుకోవాలని టార్గెట్ అన్నారు. కార్యకర్తలు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. అయితే,

ముఖ్యనేతలు ఎవ్వరూ రావడం లేదన్నది సరికాదన్నారని..దీన్ని రాజకీయం చేయద్దని తెలిపారు. అయితే, గత కొంతకాలంగా బీజేపీలో ఈటెల రాజేందర్, రాజగోపాల్ అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో వారిద్దరూ ఇళ్లనుంచి బైటికి రాకపోవడంతో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

Tags:    

Similar News