Etela Rajender: తెలంగాణ రైతులను ఆదుకోని దుర్మార్ఘుడు కేసీఆర్: ఈటల
ఆదిలాబాద్ లో నిర్వహించిన బీజేపీ జన గర్జన సభలో పాల్గొన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎక్కడా 24 గంటల కరెంట్ రావడం లేదని.. ఇచ్చినట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పుకొచ్చారు. తమలాంటి వారు బీఆర్ఎస్ పనితీరును ఎండగడుతుంటే.. కేసీఆర్ ఏం మాట్లాడలేకపోతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పూర్తి చేసిన ఒక్క అభివృద్ధి పనిని చూపించినా రాజకీయాలకు దూరం అవుతానని తెలిపారు. తమ అభివృద్ధిని నిరూపించకపోతే.. కేసీఆర్ ముక్కు నేలకు రాస్తావా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను కేవలం కేసీఆర్ కుటుంబమే అనుభవిస్తుందని ఆరోపించారు. ‘మా డబ్బులు తీసుకుపోయి హర్యానా, పంజాబ్ రైతులకు చెక్కులిస్తున్నారే తప్ప.. తెలంగాణ రైతులను ఆదుకోని దుర్మార్ఘుడు కేసీఆర్. కరెంట్ సమస్య తీర్చాలని ఖమ్మం రైతులు ధర్నా చేస్తే జైల్లో పెట్టించిన వాడు కేసీఆర్’అని ఈటల మండిపడ్డారు. కాగా ఆదిలాబాద్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది.